Bomb Attack | బీహార్ (Bihar) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి (Bomb Attack) చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
హాజీపుర్ (Hajipur)లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు స్కూల్‌పై రాళ్లు రువ్వారు. అదేవిధంగా పొగ బాంబులు విసిరారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Bhupesh Baghel | మద్యం కుంభకోణం.. మాజీ సీఎం కుమారుడికి ఈడీ సమన్లు
Wrestling Federation Of India | కేంద్ర క్రీడా శాఖ కీలక నిర్ణయం.. WFIపై సస్పెన్షన్ ఎత్తివేత