Bhupesh Baghel | ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel) కుమారుడు చైతన్య బఘేల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు సమన్లు జారీ చేశారు. చైతన్య బఘేల్ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయనకు సమన్లు (ED summons) పంపారు. మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.
మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. భిలాయ్‌లోని ఆయన నివాసంతోపాటు చైతన్య స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.30 లక్షల నగదు, పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మద్యం కుంభకోణం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం పాటిల్లిందని, మద్యం సిండికేట్‌కు రూ.21 వేల కోట్లకు పైగా లాభం చేకూరిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తున్నది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే చైతన్య బఘేల్ నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.
Also Read..
బఘేల్ కుమారుడి ఇంట్లో ఈడీ సోదాలు
Wrestling Federation Of India | కేంద్ర క్రీడా శాఖ కీలక నిర్ణయం.. WFIపై సస్పెన్షన్ ఎత్తివేత
Elon Musk | ఎక్స్‌పై సైబర్ ఎటాక్.. ఉక్రెయిన్ హస్తం ఉందన్న ఎలాన్ మస్క్