MLA Chinta Prabhakar | కొండాపూర్, ఏప్రిల్ 15 : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా ఇవాళ కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్, తొగర్పల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ కార్పోరేషన్ చైర్మన్ నిర్మాలా జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు.
రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.2320, సాధారణ రకం రూ.2300. సన్నరకం వడ్ల కనీస మద్దతు ధర రూ. 2320, బోనస్ రూ. 500, మొత్తం 2820 కలిపి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమచేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని కొండాపూర్ మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు రాజు, పవన్ కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ సడాకుల కుమార్, ఆత్మకమిటి చైర్మన్ వై ప్రభు, తహసీల్ధార్ బి అశోక్, ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి గణేష్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మ్యాకం విఠల్, మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు పట్లోళ్ల మల్లేశం, గోవర్థన్‌రెడ్డి, రాంచందర్, రాజగౌడ్, ప్రేమనందం, మల్లాగౌడ్, ప్రకాశం, మోహన్, రాందాస్, రాజు, నర్సింహారెడ్డి, గౌరిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, షఫీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్