రాయికోడ్ /సంగారెడ్డి : ప్రతి పల్లె పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండల పరిధిలోని చిమ్లాపూర్ శివారులో ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వనాలు, ప్రజలకు ఎంతో ఆహ్లదకరంగా ఉంటాయన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్లయ్య, పీబా శ్రీనివాస్ రావు, జెడ్పీటీసీ మల్లికార్జున్ పటేల్, ఎంపీడీఓ వెంకటేశం, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బస్వరాజు పాటిల్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ విఠల్, వరము ఉపాధ్యక్షుడు తుకారాం కురుమ, శంకర్, సతీష్ తదితరులు ఉన్నారు.