Engineers day | పటాన్ చెరు, సెప్టెంబర్ 14 : ప్రపంచంలో అద్భుతాలు సృష్టించాలన్నా.. సమాజాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లాలన్నా ఇంజనీర్ తోనే సాధ్యమని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు.
సోమవారం పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మోక్షగుండం ఈశ్వరయ్య కర్ణాటకలోని మైసూర్ సమీపంలో కావేరి నదిపై కృష్ణరాజసాగర్ డ్యాం ఆనకట్ట నిర్మాణం చేసి వ్యవసాయ నీటి అవసరాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. హైదరాబాద్ నగరంలో వరదల నియంత్రణకు మూసీ నదిపై వరద నియంత్రణ పథకాన్ని రూపొందించారన్నారు.
దేశంలోని జలాశయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. ప్రపంచంలోనే తొలిసారి ప్రాజెక్టులకు ఆటోమేటిక్ వరద గేట్లు తెరిచే విధానాన్ని ఆవిష్కరణ చేశారన్నారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, రఘు, అశోక్, పృథ్విరాజ్, విజయ్ కుమార్, షణ్ముఖ , సత్యనారాయణ, నిరంజన్, శేఖర్, అనిల్, సతీష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : పింఛన్లు పెంచాలని భూదాన్ పోచంపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త
SIR | ‘సర్’ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటాం : సుప్రీంకోర్టు