పటాన్చెరు టౌన్ : ఎలక్ట్రికల్ వాహనాలతో కాలుష్యానికి చెక్ పెట్టవచ్చని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు 113వ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వెహికిల్ షోరూంను కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొన్ని ద్విచక్రవాహనాలను నడిపి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా తిరగడానికి ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతో ఉపయోగకరమని, రోజురోజుకు ఇంధన నిలువలు తరిగిపోతున్న తరుణంలో భవిష్యత్‌లో సోలార్, ఎలక్ట్రికల్ వాహనాలే కీలక పాత్ర వహిస్తాయన్నారు. మెట్టు కుమార్‌యాదవ్ మాట్లాడుతూ శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా నడిచే ఇలాంటి వాహనాలకు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లగలిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో విజయ్‌కుమార్, కౌన్సిలర్ మల్లేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.