Drainage Water | జహీరాబాద్, ఏప్రిల్ 15 : జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రంజోల్లోని 4వ వార్డులో మురికికాల్వలు అపరిశుభ్రంగా మారి కంపు కొడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. స్థానిక వార్డులోని పోస్టాఫీస్ ముందు రోడ్డు (అగున్ ఎన్క్లీవ్) నుంచి నక్షత్ర వెంటర్ మధ్యలోని మురికి కాల్వను శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు రోడ్లపైకి వస్తుందన్నారు.
మురికి నీరు రోడ్లపైకి వస్తుండటంతో.. దుర్గంధం వెదజల్లి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు, ఈగలు విజృంభించడంతో రోగాల బారిన పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సంబంధిత జిల్లా అధికారులు ఇప్పటికైనా ఈ సమస్యపై స్పందించి తగు చర్యలు తీసుకుని.. మురికికాల్వలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక వాసులు కోరుతున్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్