Mettu kumar yadav | పటాన్ చెరు, అక్టోబర్ 25 : పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని, రోడ్డు పనులు వేగవంతం చేయాలని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం పటాన్ చెరు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
పట్టణంలోని ఎంజీ రోడ్డు నుంచి మున్నూరుకాపు ఫంక్షన్ హాల్, 65వ జాతీయ రహదారి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ. 1.40 లక్షలతో పనులు చేయడం జరుగుతుందన్నారు. సీసీ రోడ్డు పనులు వేగవంతం చేయాలని. నూతన మార్కెట్ రోడ్డు ఇంద్రేశం రోడ్డులో ట్రాఫిక్ సమస్య నెలకొందని.. దాని పరిష్కరించేందుకు అధికారులు అధికారులు కృషి చేయాలన్నారు.
రానున్న ఛాత్ పూజా కార్యక్రమాన్ని శాంతినగర్ శ్రీరామ్ నగర్ కాలనీ, బాలాజీ నగర్, ఆల్విన్ కాలనీ, బండ్లగూడ ప్రాంతాలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సురేష్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు సురేష్ కుమార్, కృష్ణవేణి, శివకుమార్, మహేష్, శ్రీనివాస్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Shreyas Iyer: డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్.. కానీ గాయపడ్డ అయ్యర్.. వీడియో