Ex MLA Bhoopal reddy | కల్హేర్, మార్చి 30: కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా వారికి భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ఏడాదిన్నరగా ఎదురు చూస్తూ ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్నా ప్రజల కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.
ఇవాళ మండల కేంద్రమైన కల్హేర్ గ్రామానికి చెందిన పోచబోయిన మాణిక్యం-కవితల కూతురుకు మంజూరైన రూ.27 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఉగాది పర్వదినం పురస్కరించుకొని తెలుగు విశ్వావసు నూతన సంవత్సరంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తామన్న సంక్షేమ పథకాలను అందించేలా వారికి భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని భగవంతున్ని కోరుతున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింహారెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, మాజీ అధ్యక్షుడు నారాయణరావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు పండరి, నాయకులు ప్రభుగౌడ్, గంట విఠల్, రవిందర్‌రెడ్డి, సాయిరాం, సత్యగౌడ్, నర్సింహగౌడ్, సాయిలు, ప్రశాంత్‌సాగర్, రాజు, రఘుగౌడ్, శివరాం నాయక్, జనార్ధన్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్