BRS Party | జహీరాబాద్, ఏప్రిల్13 : త్వరలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలో చేరికలతో సందడి వాతావారణం నెలకొంది. ఇవాళ జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
స్థానిక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మండలానికి చెందిన డైరెక్టర్ బాలరాజ్, సర్పంచ్ సిద్ధప్ప, నాయకులు అనిల్, దేవయ్య, సాల్మన్, రఫీ, రాజు, శివకుమార్,సిద్దు,గోపాల్, పవన్ కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్యరావు పార్టీ కండువా వేసి టిఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, పిఎసిఎస్ చైర్మన్ మచేందర్, పార్టీ సీనియర్ నాయకులు గుండప్ప ,విజయకుమార్, మండల పార్టీ నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్