జిన్నారం, అక్టోబరు 28 : గత ప్రభుత్వాల హయంలో నిరాధరణకు గురైన వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం జిన్నారంలో మండల పరిధిలోని వావిలాల, జిన్నారం, రాళ్లకత్వ, ఊట్ల గ్రామాలలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరుపాలని కోరారు. గ్రేడ్ ఏ రకం వడ్లు క్వింటాలుకు 1960, గ్రేడ్ బి రకం వడ్లు క్వింటాలుకు 1940 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్‌గౌడ్, సర్పంచులు లవణ్యశ్రీనివాస్రెడ్డి, ఆంజనేయులు, సుశాంతి, రమా, శ్రీకాంత్‌రెడ్డిలు, ఎంపీటీసీలు వేంకటేశంగౌడ్, స్వాతిప్రభాకర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, ఐకేసీ సిబ్బంది లత, జ్యోతి, రైతులు స్థానికులు పాల్గొన్నారు.