నారాయణఖేడ్, జూన్ 13 : నారాయణఖేడ్‌లో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అనుమతించినట్లు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ను కలిసి జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా ఇందుకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు.
జొన్న రైతులు తమ వద్ద జొన్నలను ప్రైవేట్ వ్యాపారులకు గాని దళారులకు గాని విక్రయించరాదని సూచించారు. త్వరలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన మద్దతు ధర చెల్లించి జొన్నలను కొనుగోలు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జొన్న రైతులను ఆదుకునే దిశగా కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అనుమతినిచ్చిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.