Bathukamma celebrations | పటాన్ చెరు, సెప్టెంబర్ 24 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పార్టీకి చెందిన మహిళానేతలతోపాటు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి.. పాటలు పాడుకుంటూ తెలంగాణ సంస్కృతిని యావత్ ప్రపంచానికి మరోసారి చాటి చెబుతున్నారు.
బతుకమ్మ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పిలుపుమేరకు పటాన్చెరు నుంచి మహిళలు హైదరాబాడ్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు తరలివెళ్లారు. ఈ మేరకు బుధవారం పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా నేతలు హైదరాబాద్ తరలివెళ్లేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.
కేటీఆర్ పిలుపు మేరకు బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసేందుకు మహిళా నేతలు పటాన్చెరు నుంచి ప్రత్యేక బస్సులో నెక్లెస్ రోడ్‌కు బయలుదేరారు.
BC Reservations | బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే : ఎమ్మెల్సీ మధుసూదనాచారి
Group-1 | గ్రూప్-1పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే
Supreme Court | అస్తిత్వ సంక్షోభంలో హిమాలయన్ రాష్ట్రాలు.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు