Harish Rao | పటాన్చెరు, మార్చి 9 : పటాన్చెరులో మార్చి 11వ తేదీన నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రావాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును మహిళలు ఆహ్వానించారు. నగరంలోని హరీశ్‌రావు కార్యాలయంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డిలు , బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్‌రెడ్డి, మహిళా కార్యకర్తలతో కలిసి హరీశ్‌రావుకు ఆదివారం నాడు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా పటాన్చెరు కార్పొరేటర్ సతీమణి రమా మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మహిళా నాయకులు హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పటాన్చెరులో మంగళవారం జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని వారు ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.