Jubileehills bypoll | పటాన్ చెరు, అక్టోబర్ 16 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత విజయం లక్ష్యంగా గడప గడప ప్రచారం నిర్వహించారు. పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ ఆదర్శ రెడ్డి నేతృత్వంలో గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి , తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయలేకపోయింది.
పేదలకు మేలు చేసే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాలనలోనే సాధ్యమయ్యాయి. ప్రజల సంక్షేమం మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి షరీఫ్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Devarakonda Rural : 18న నిర్వహించే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి : సతీశ్ గౌడ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.