Zaheerabad | జహీరాబాద్, ఫిబ్రవరి 4 : మరోసారి హామీల పేరుతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తున్నదని ఝరాసంఘం సంగమేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రెండో వార్డ్ ఇంచార్జ్ నర్సింలు గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన ఇచ్చిన హామీలను అమలు చేయలేదని గుర్తుచేశారు. మరోసారి కాంగ్రెస్ చేతిలో మోసపోవద్దని సూచించారు.
బుధవారం జహీరాబాద్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి తరపున తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేసిన అభివ్పద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి కి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలను వివిధ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం తప్ప.. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తామన్న పింఛన్ రూ.4వేలు, ఆడబిడ్డల పెళ్లికి ఇస్తామన్న తులం బం గారం, మహిళలకు ఇస్తామన్న రూ 2,500 ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో మోసపూరిత హామీలను నమ్మి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు ఓటు వేసి మోసపోకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి వార్డు అభివ్పద్ధికి నిధులు తీసుకోస్తారని, అందుకే భరత్ నగర్ ప్రస్తాపూర్ ప్రజలందరూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయలక్ష్మి కి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.