Mangoes | జహీరాబాద్, ఏప్రిల్ 22 : వేసవి రాగానే అందరికీ మామిడి పండ్ల మజా మొదలవుతుంది. కానీ గ్రామ, పట్టణ చౌరస్తా, మార్కెట్లో ఎక్కువగా రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లే లభిస్తున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. సహజంగా పండిన పండ్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
వేసవి రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇవి ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మనం తినే మామిడి పండ్లు సహజంగా పండాయా..? లేక రసాయనాలతో మగ్గబెట్టినవా..? అనే విషయం చాలా ముఖ్యమైనది. మార్కెట్లో ఎక్కువగా మగ్గబెట్టిన పండ్లే కనిపిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం.
సహజంగా పండిన మామిడి పండ్లు కొద్దిగా గట్టిగా ఉంటాయి. కొద్దిగా ఒత్తితే అవి మెల్లగా ఒడిగొస్తాయి. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు ఎక్కువగా మెత్తగా ఉంటాయి. కాస్త బిగించి చూసినప్పుడు అవి అతి త్వరగా తొడిమపోతాయి. ఇది రసాయనాలతో చేసిన ప్రభావమే.
సహజంగా పండిన మామిడి పండ్లపై చిన్న చిన్న గీతలు, కొద్దిగా మచ్చలు ఉండొచ్చు. కానీ అవి ప్రమాదకరం కావు. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లపై ఆకస్మికంగా మచ్చలు ఏర్పడటాన్ని గమనించవచ్చు. ఇవి అసహజంగా కనిపిస్తాయి.
సహజంగా పండిన మామిడి పండ్లు వేరువేరు రంగుల్లో కనిపిస్తాయి. కొన్ని చోట్ల పసుపు, కొన్ని చోట్ల ముదురు నారింజ రంగులో ఉంటాయి. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు పూర్తిగా ఒకే రంగులో మెరిసిపోతాయి. అవి అసహజంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు.
మామిడి పండ్లు కొనేటప్పుడు ఈ తేడాను గమనించండి…
వాటంతట అవే పండిన మామిడి పండ్లకు సహజమైన తియ్యటి వాసన వస్తుంది. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లకు కాస్త అసహజమైన వాసన ఉండవచ్చు లేదా అవి వాసన లేకుండా ఉంటాయి. కాబట్టి మీరు మామిడి పండ్లు కొనేటప్పుడు వాటి వాసనను గమనించడం మంచిది.
ఎలా తెలుసుకోవాలంటే..?
మామిడి పండు సహజంగా పండిందా..? లేదా రసాయనాలతో మగ్గబెట్టిందా..? అనే విషయం తెలుసుకోవడానికి ఇది చాలా సరళమైన పద్ధతి. ఓ గిన్నెలో నీటిని నింపి అందులో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు నీటిలో మునుగుతాయి, కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లు నీటిపై తేలిపోతాయి. ఒక గిన్నెలో నీటిని నింపి అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి మామిడి పండ్లను అందులో నిమిషం పాటు ఉంచండి. ఆ తర్వాత మామిడి పండ్లను కడిగి చూడండి. అవి అసహజంగా రంగు మారితే అది రసాయనాలతో పండించిన మామిడి పండు అని అర్థం.
సహజంగా మగ్గ బెట్టిన పండ్లనే తినాలి..
సహజంగా పండిన మామిడి పండ్లను మాత్రమే తినండి. కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండ్లు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు, పొట్ట ఉబ్బరం, అసహజమైన కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే మామిడి పండ్లు తినేటప్పుడు ఆరోగ్యకరమైనవి ఎంచుకోవడం మంచిదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు