ఝరాసంగం, మే 16 : మండల పరిధిలోని మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగద్గురు మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సంబంధిత కరపత్రాన్ని, గోడపత్రికను శుక్రవారం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో పీఠాధిపతులు 1008 వైరాగ్య శిఖమణి అవధూతగిరి మహారాజ్, మహామండలేశ్వర సిద్దేశ్వరానందగిరి మహారాజ్లు విడుదల చేశారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరై బసవేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Gujarat Samachar: గుజరాత్ సమాచార్ పత్రిక ఓనర్ బాహుబలి షా అరెస్టు