Bakrid Celebrations | జహీరాబాద్, జూన్ 7 : త్యాగానికి, విశ్వాసానికి, మానవతా విలువలకు ప్రాతినిధ్యం వహించి, మత, సామాజిక ఐక్యతను పెంపొందించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, న్యాల్కల్ ఝరాసంగం, మొగుడంపల్లి మండలాల్లోని గ్రామాల్లో శనివారం ఉదయం ఈద్ నమాజును నిర్వహించారు.
ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమాజ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా ఈద్గాలో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. బక్రీద్ అనేది త్యాగానికి, సమాజ ఐక్యతకు ప్రతీక అన్నారు. మానవత్వాన్ని, సహాయ సహకారాన్ని నేర్పే పండుగ అని పేర్కొన్నారు.
కుర్బానీ చేసి మాంసాన్ని బంధుమిత్రులతోపాటు పేదలతో కలిసి పంచుకున్నారు. పండుగకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలు బిర్యానీ, శీర్ ఖుర్మా, మటన్ కబాబ్‌లు ముస్లిం కుటుంబాల్లో ఉత్సాహం నింపాయి. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
కోహీర్‌లో ఘనంగా బక్రీద్..
కోహీర్‌లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లింలు పెద్ద సంఖ్యలో స్థానిక ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పటాన్చెరులో బక్రీద్ వేడుకలు..
పటాన్చెరు, జూన్ 7 : పటాన్చెరులో ముస్లిం సోదరులు బక్రీద్ పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలు ఈద్గాలు, మజీద్‌లలో నమాజ్ చేశారు. ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ ఆదర్శరెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌లు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు