పటాన్చెరు : కాంగ్రెస్ పార్టీ 420 మోసపూరిత హామీలపై పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో ఆటో కార్మికులు కదం తొక్కారు. బీహెచ్ఇఎల్ చౌరస్తా నుండి అశోక్ నగర్, బీరంగూడ, రామచంద్రాపురం పటాన్చెరు ముత్తంగి మీదుగా ఇస్నాపూర్ వరకు వేలాది ఆటోలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఉచిత బస్సు బస్సు పథకంతో ఆటో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఆటో కార్మికుల జీవన భృతి కోసం రూ. 12 వేలు చెల్లిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఆటో కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.