School Development | సంగారెడ్డి, జూన్ 15 : చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసిన పాఠశాల అభివృద్దికి పూర్వ విద్యార్థులు 2000-2001 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు రూ.2 లక్షలు అందజేసి గురు దక్షిణ చాటుకున్నారు. ఆదివారం పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అనంతరం విద్యాబుద్దులు నేర్పిన గురువులను సత్కరించారు. తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనే తపనతో రూ.2 లక్షలతో ప్లే స్కూల్ మెటీరియల్, ఫ్లోర్ మ్యాట్ వేయించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల ప్రవేశానికి మా వంతు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా సహకారం కావాలన్నా చేయడానికి ముందుంటామని పాఠశాల యాజమాన్యానికి భరోసా ఇచ్చారు.
అలాగే తక్కువ ఫీజులతో పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే పాఠశాలగా సరస్వతి మందిర్‌కు పూరుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం