Sangareddy : సంగారెడ్డి, జులై 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (K.Rosaiah) 92వ జయంతిని పురస్కరించుకుని ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను అదనపు ఎస్పీ సంజీవ్రావ్ (Sanjeev Rao) గుర్తు చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసిన అడిషనల్ ఎస్పీ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. రోశయ్య దేశ రాజకీయ వేత్తఅని అన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం వేమూరులో 1933లో జన్మించిన ఆయన.. విద్యార్థి నాయకుడిగా ఎదిగారని తెలిపారు. 2009-2010 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య.. 2011-2016 వరకు తమిళనాడు గవర్నర్గా, కర్ణాటక రాష్ట్రానికి (అదనపు గవర్నర్)గా బాధ్యతలు నిర్వర్తించారని సంజీవ్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి కల్యాణి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ. డానియెల్, ఎస్.బి. ఎస్.ఐ. యాదవరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.