Upadhi Coolie | ఝరాసంగం, ఏప్రిల్ 29 : ఉపాధిహామీ అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేసి ఎక్కువ కూలీ డబ్బులు పొందాలని సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఉపాధి హామీ కూలీలకు సూచించారు. ఇవాళ ఝరాసంగం మండల కేంద్రంతోపాటు కుప్పానగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను ఉపాధి హామీ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పనులు చేసే ప్రాంతంలో సౌకర్యాల కల్పన, పని వేళలు తదితర వాటిపై ఆయన కూలీలతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకునే లాగా చూడాలని అధికారులతో అన్నారు.
మా మండలానికి ఇంకో 68 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు అదనపు కలెక్టర్‌ను కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుధాకర్ , పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి