RTC Driver | చిలిపిచెడ్, సెప్టెంబర్ 23 : సాధారణంగా చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు బస్‌స్టాపుల్లో మాత్రమే బస్సులను ఆపుతుంటారని తెలిసిందే. అయితే కొందరు మాత్రం ప్రయాణికుల రిక్వెస్ట్‌లను బట్టి బస్ స్టాప్ లేకున్నా బస్సు ఆపి మరీ వారిని ఎక్కించుకుని వెళ్తుంటారు. రూల్స్ మాట అటుంచితే కొన్నిసార్లు మానవతా దృక్పథంతో బస్సు ఆపాల్సి ఉంటుంది. కానీ కొందరు డ్రైవర్లకు మాత్రం అవేం పట్టవు. అలాంటి ఘటనే నర్సాపూర్ పరిధిలో జరిగింది.
నర్సాపూర్ ఆర్టీసీ డిపో టీఎస్ 08 యూహెచ్ 2540 సంబంధించిన బస్సు డైవర్ నిర్లక్ష్యంగా మహిళలను చూసి కూడా బస్సు ఆపకుండా వెళ్లిపోతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు జోగిపేట్ నుండి నర్సాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చండూర్ గేటు వద్ద ఒడిలో పాపను ఎత్తుకున్న మహిళ, మరో చిన్న పాపతో కలిసి బస్సును ఆపింది. అయితే ఆ బస్సు డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఆపకపోవడంతో ఆ మహిళ తన ఇద్దరు పాపలతో కొద్ది దూరం పరిగెత్తింది. అది చూసిన చండూరు రోడ్డు వద్ద ఉన్న ప్రయాణికులు ఆమెను చూసి బస్సును గేటు వద్ద ఆపించారు.
దీంతో ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించాడు. బస్సు ఎక్కడ అంటే అక్కడ ఆపాలని రూల్ లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అక్కడున్న ప్రయాణికులు ఆపకుంటే ఆపకున్నా సరే గానీ ఆ మహిళ ఆ పసిపిల్లలను చూసి అన్నా ఆపాలి కదా.. అని ప్రయాణికులు ఆ డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రయాణికులు మాట్లాడుతూ.. ప్రతీ రోజు బస్సు డ్రైవర్లు రోజు ఇలానే మహిళలను చూసి ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందే పండగ సమయం, షాపింగ్‌కు వెళ్లాలన్నా ఇతర ప్రయాణం చేయాలన్నా బస్సులతో చాలు ఇబ్బందిగా ఉందని మహిళలు ప్రభుత్వపై, బస్సు డ్రైవర్ల పైన వాపోయారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి