AITUC | రుద్రంపూర్, మార్చి 5: సింగరేణి లో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అద్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు అన్నారు. గురువారం గోదావరిఖనిలో జరిగిన ఏఐటియుసి కేంద్ర కమిటి సమావేశంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ….సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటియుసితో నవంబర్ 2024 , మార్చి 2025లో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలు డిమాండ్ లను అంగీకరించి అమలు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా స్వంత ఇంటి పథకాన్ని, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ చెల్లింపులపై సర్క్యులర్లను జారీ చేయకుండా కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు.
ఏసీబీ కేసుతో సంబంధం లేకుండా మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలి. మెడికల్ బోర్డు ను ఏసీబీ విచారణ పేరుతో నిలిపి వేశారని వారు ఆరోపించారు. అనారోగ్యం వల్ల కార్మికులు చాలా మంది మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు కు పిలువ కుండా కాలయాపన చేస్తూ కార్మికులను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. మారుపేర్లు విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా యాజమాన్యం సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వారికి ఉద్యోగాలు రావడం లేదని వారు ఆరోపించారు. జనరల్ సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికుల నుంచి జీతం రికవరీ చేస్తామని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని, దానిని వెంటనే రద్దు చేసి రికవరీ చేయొద్దని డిమాండ్ చేశారు.
కొత్త గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వంపై ఆందోళనలు..
కేంద్ర ప్రభుత్వం సింగరేణి కి కొత్త గనులు ఇవ్వకుండా తెలంగాణ లో ఉన్న సింగరేణి సంస్థ ను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వేలంతో సంబంధం లేకుండా తెలంగాణ లో ఉన్న కొత్త గనులు సింగరేణి కి కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి లో మైనింగ్, క్లరికల్, ట్రేడ్స్ మెన్ ల సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, లేకుంటే సమ్మె కు పిలుపునిస్తామని వారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కే.సారయ్య, వై.వి.రావు, ముస్కె సమ్మయ్య, మడ్డి ఎల్లా గౌడ్, కే.వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు అక్బర్ అలీ, కవ్వంపల్లి స్వామి, కందుకూరి రాజారత్నం, బ్రాంచ్ కార్యదర్శులు బాజీ సైదా, మల్లికార్జున్, రాంగోపాల్, రమేశ్, తిరుపతి, మల్లేష్, జీగురు రవిందర్, ఎం.ఆర్.సి రెడ్డి, రంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్