MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, సెప్టెంబర్ 24 : నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం జీఓ ఆర్టీ నెంబర్ 545, ఎం.ఏ విభాగం ద్వారా రూ.15 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత వారం రోజుల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీతో నిధుల విడుదలపై మాట్లాడడం జరిగిందని వెల్లడించారు.
నర్సాపూర్ మాజీ కౌన్సిలర్లు తన వద్దకు వచ్చి పంపించిన ప్రపోజల్స్ అలాగే ఉన్నాయని చెప్పడంతో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడడం జరిగిందని గుర్తుచేశారు. వారం రోజులలోగా నిధులను మంజూరు చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇవ్వడం జరిగిందని, ఆ మేరకు నర్సాపూర్ మున్సిపల్ అభివృద్దికి నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15 వార్డులలో ఉన్న సమస్యలను ఈ నిధులతో రహదారులు, కాలువలు, నీటి సౌకర్యాలు, వీధి లైట్లు, మౌలిక వసతుల మెరుగుదలకు వినియోగించబడతాయని అన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువస్తానని ఆమె తెలిపారు.
BC Reservations | బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే : ఎమ్మెల్సీ మధుసూదనాచారి
Group-1 | గ్రూప్-1పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే
Supreme Court | అస్తిత్వ సంక్షోభంలో హిమాలయన్ రాష్ట్రాలు.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు