Roads | మెదక్ రూరల్, అక్టోబర్ 26 : ఆ రోడ్లపై వెళ్లాలంటే వాహనదారులకు భయం పట్టుకుంటోంది. ఏ క్షణం ఎటువైపు ఎలాంటి ప్రమాదం చుట్టుముడుతుందోనని భయపడుతున్నారు. దీనిక్కారణం రోడ్లపై వరి ధాన్యం రాశులు కనిపించడమే.
హవేలీ ఘన్పూర్ మండలంలోని గ్రామాలకు వెళ్లే రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. వరి కోతలు మొదలయ్యాయంటే రోడ్లన్నీ కల్లాలను తలపిస్తుండటమే ఇందుకు కారణం. మొత్తం ధాన్యం రాశులతో నిండిపోతున్నాయి. సగం రోడ్లు ధాన్యం కుప్పలతో ఆక్రమిస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి.
పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దారులన్నీ ధాన్యం కల్లాలుగా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళ ధాన్యం కుప్పలు కనిపించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ధాన్యం ఆరబెట్టేందుకు పొలాల వద్ద కల్లాలు లేకనే రోడ్లపై ధాన్యం పోయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది.

Jigris Release Announcement | విడుదల తేదీని ప్రకటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్