Additional collector Nagesh | అల్లాదుర్గం, జూన్ 05 : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. మండంలోని సీతానగర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులకు వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు.
అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ మాట్లడుతూ.. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం పొందనున్నాయని తెలిపారు. భూ భారతి ద్వారా రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అంతకు ముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన సీతానగర్ గ్రామంలో మొక్కను నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసిల్దార్ మల్లయ్య, చంద్రశేఖర్, ఆర్ఐ సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు