Ration Rice | వెల్దుర్తి, జూన్ 19 : మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం, బియ్యం సరఫరాలో అంతరాయంతో మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో వచ్చిన ఒక నెల బియ్యంను రేషన్ డీలర్లు వచ్చిన లబ్దిదారులకు మూడు నెలల చొప్పున పంపిణీ చేసి దుకాణాలను మూసివేశారు.
వెల్దుర్తి మండలంలో మొత్తం 25 రేషన్ దుకాణాలు ఉండగా అన్ని రేషన్ దుకాణాలకు ఎప్పటిలాగే ఒక నెల కోటా బియ్యం మాత్రమే సరఫరా అయ్యాయి. అప్పటికే ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను అందిస్తామని ప్రకటించడంతో రేషన్ డీలర్లు ఒక నెల బియ్యాన్ని వచ్చిన లబ్దిదారులకు మూడు నెలల చొప్పున పంపిణీ చేయడంతో కొద్ది బియ్యం మాత్రమే అందాయి. దుకాణాలలో ఉన్న బియ్యం అయిపోగానే రేషన్ డీలర్లు దుకాణాలను మూసివేశారు.
బియ్యం వచ్చిన వారం పదిరోజుల్లోనే అయిపోవడంతో తీసుకోవాల్సిన లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్దకు వచ్చి చూసి వెళుతున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను అడుగగా వెల్దుర్తి మండలానికి కేవలం ఒక నెల బియ్యం మాత్రమే వచ్చాయని, వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారని, త్వరలోనే మరో రెండు నెలల బియ్యం వస్తాయని రాగానే పంపిణీ చేస్తారని చెబుతున్నారు.
ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం ఆర్బాటంగా బియ్యం పంపిణీని ప్రారంభించి, పూర్తి బియ్యం పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పథకాలను మధ్యలోనే వదిలేస్తున్న ప్రభుత్వం బియ్యం పంపిణీ చివరి వరకు చేస్తుందా..? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు