Plastic | నర్సాపూర్, జూన్2 : ఫ్లాస్టిక్‌ను నిర్మూలించాలంటూ నర్సాపూర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి