Govt Schools | ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం జరుగుతుందని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ బడిబాటను నిర్వహిస్తున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా టేక్మాల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం బడిబాటను నిర్వహించారు. టేక్మాల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో అర్హత కలిగిన, అనుభవజ్ఙులైన ఉపాధ్యాయులు ఉంటారని.. ఉచితంగా పాఠ్యపుస్తకాలతోపాటు రెండు జతల యూనిఫామ్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుందని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు.
విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుజాత, ఉపాధ్యాయులు అమిరోద్దీన్, మాధవీలత, రమాదేవీ, గౌతమిశైల, సింధూర, అశోక్, లావణ్య, అస్ర ఉన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..