Professor Jayashankar | టేక్మాల్ః తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ అలుపెరుగని పోరాటం చేశారని, చివరి శ్వాస వరకు తెలంగాణ లక్ష్యంగా పోరాడారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా శనివారం మండల కేంద్రమైన చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర వెలకట్టలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన ముందే గ్రహించారని తెలిపారు. జయశంకర్ సార్ భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే అగ్రగామిగా నిలిపారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించేలా చేశారని కొనియాడారు. ఆయన తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ మాజీ ఎంపీటీసీ కమ్మరి సిద్ధయ్య, నారాయణఖేడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విజయ్, చింత రవి, సుబేదార్ సురేష్, నారాయణ, సాయిలు, శ్రీశైలం, రాజేందర్, దుర్గయ్య, మతిన్, వసీం, యాదగిరి, వసంత్ నాయక్, యాదయ్య, రమేష్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్