Dhurandhar 2 | ‘ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిల్?.. అసలు కారణం ఇదే!
Ranveer Singh | బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) తెలుగు ప్రీమియర్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది.
Dhurandhar 2 Telugu Shows Cancelled | బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్: ది రివెంజ్’ తెలుగు ప్రీమియర్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. కంటెంట్ డెలివరీలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా నేడు (మార్చి 18) ప్లాన్ చేసిన అన్ని తెలుగు వెర్షన్ పెయిడ్ ప్రీమియర్ షోలను అధికారికంగా రద్దు చేశారు. ఇప్పటికే బుక్‌మైషో, పేటీఎం వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ షోల బుకింగ్స్‌ను తొలగించడమే కాకుండా, టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు పూర్తి మొత్తాన్ని వెనక్కి ఇచ్చే రీఫండ్ ప్రక్రియను కూడా నిర్వాహకులు ప్రారంభించారు.
ఈ సాంకేతిక ఇబ్బందుల ప్రభావం కేవలం తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషా ప్రీమియర్లపైనే పడగా, హిందీ వెర్షన్ కంటెంట్ అందుబాటులో ఉండటంతో నగరంలోని కొన్ని ప్రధాన మల్టీప్లెక్స్‌లలో హిందీ షోలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. సుమారు 3 గంటల 49 నిమిషాల సుదీర్ఘ నిడివితో, ‘A’ సర్టిఫికేట్ పొందిన ఈ భారీ చిత్రం రేపు ఉదయం నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్లాన్ చేసిన విధంగానే గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రీమియర్ షోల రద్దుతో నిరాశ చెందిన ప్రేక్షకులు తమ రీఫండ్ స్టేటస్ గురించి సంబంధిత యాప్స్ లేదా థియేటర్ యాజమాన్యాన్ని సంప్రదించాలని చిత్రబృందం సూచించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

