హైదరాబాద్ : కరీనంగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.
పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, చంద్రశేఖర్, దివ్య దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. దివ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.