legal Services | శివ్వంపేట, మే 17 : గ్రామాల్లో భారత ప్రభుత్వ చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్, మండల లీగల్ సర్వీస్ కమిటి చైర్పర్సన్ ఎం.హేమలత అన్నారు. ఇవాళ శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయగా జడ్జి హేమలత హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులే దేశానికి వెన్నుముకలాంటివారని..అలాంటి రైతులకు ఒక్కోసారి ఫర్టిలైజర్ దుకాణదారులు కల్తీ విత్తనాలు ఇస్తే వాటిపై జరిగిన నష్టంపై కన్జ్యూమర్ ఫోరం ద్వారా రైతు నష్టపరిహారాన్ని పొందవచ్చన్నారు. రైతులు పంటపొలాల సమస్యతోగానీ, ఆర్థికపరమైన సమస్యతో కానీ అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు.
భూములకు సంబంధించిన ఏదైనా చట్టపరమైన సమస్యలు తలెత్తినప్పుడు న్యాయ సహాయం కోసం తమ లీగల్ కమిటీని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు మోటార్‌వాహనాలు ఇవ్వొద్దని, బాల్యవివాహాలు చేయరాదన్నారు. ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి అస్సలు వాహనాలు నడుపొద్దన్నారు. గ్రామాల్లో కల్తీ మద్యం, కల్తీ కల్లు విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌గౌడ్, న్యాయవాది స్వరాజరాణి, లోక్‌అదాలత్ బెంచ్ మెంబర్ మధుశ్రీ శర్మ, ఎంపీడీఓ నాగేశ్వర్రావు, ఏఎస్సై అంతన్నగారి సాయిలు, ఏఈఓ మౌనిక, న్యాయవాదులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రభు, రాజునాయక్, డి.శ్రీధర్‌రెడ్డి, ప్రకాశ్, కేఏ శ్రీనివాస్‌రావు, సాయిరాం, లీగల్ సర్వీస్ సిబ్బంది, గ్రామస్థులు ఉన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు