Arogya Lakshmi Meal | మెదక్ రూరల్ : ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని ప్రతీ గర్భిణీ, బాలింత సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ హైమావతి అన్నారు. ఇవాళ మెదక్ మండలం శివాయపల్లి అంగన్వాడీ సెంటర్స్‌లో పోషణ పక్వాడ ప్రోగ్రామ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పీడీ హైమావతి మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్స్ అందించే ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని ప్రతీ గర్భిణీ, బాలింత తల్లులు అందరూ సద్వినియోగించుకోవాలని తెలిపారు. 7 నెలల నుండి 3 సంవత్సరాలలోపు పిల్లలకు బాలామృతం అందించడం జరుగుతుందన్నారు.
3 సం నుండి 6 సం వరకు పిల్లలకు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఆహారం, గుడ్లు అందించడం జరుగుతుందని పీడీ హైమావతి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు సమయపాలన పాటించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ రమ, అంగన్వాడీ టీచర్లు, తల్లులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్