Money recovery | నర్సాపూర్, అక్టోబర్ 10: ఆన్లైన్లో సైబర్ నేరగాడి ఉచ్చులో పడి ఓ రైస్ మిల్లర్ పోగొట్టుకున్న డబ్బును నర్సాపూర్ పోలీసులు రిటర్న్ తెప్పించిన సంఘటన నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్ కుమార్ వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన ఇమ్మడి విశ్వనాథం అనే రైస్ మిల్లర్ ఖాతాలో నుండి ఈ నెల 6వ తేదిన తన ప్రమేయం లేకుండా తన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కట్ అయ్యాయి.
తాను సైబర్ నేరానికి గురయ్యానని తెలుసుకున్న విశ్వనాథం నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఆరా తీయగా విశ్వనాథం బ్యాంక్ ఖాతా నుండి రూ.5,85,000 కట్ కావడం జరిగింది. వెంటనే నర్సాపూర్ పోలీస్ వారు 1930కి కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయగా ఆ తర్వాత మెదక్ జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ ఏ సుభాష్ చంద్రబోస్, సీఐ జాన్‌రెడ్డి, ఎస్ఎఐ రంజిత్ కుమార్ రెడ్డి , సైబర్ క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విశ్వనాథం అకౌంట్ నుండి పోయిన రూ.5,85,000 అకౌంట్‌ను హోల్డ్ చేయించి, తిరిగి విశ్వనాథం ఖాతాలోకి డబ్బులు జమ చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అనుమానాస్పద లింకులు, వెబ్సైట్లు, మెసేజ్‌లు క్లిక్ చేయవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, ఓటీపీలను ఇతరులకు చెప్పవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసం చేసినట్లయితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Pending Fees | పెండింగ్ ఫీజులు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి
Tejashwi Yadav | ఆర్జేడీని గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం.. బీహారీలకు తేజస్వియాదవ్ హామీ
Penpahad : మానవాళి శ్రేయస్సుకే అంతరిక్ష ప్రయోగాలు : సీనియర్ సైంటిస్ట్ వెంకటరమణ