Pigs hulchul | రామాయంపేట, జూలై 13 : రామాయంపేట పట్టణంలోని పందులు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. పట్టణంలో ఏ వీధిలో చూసినా పందుల బెడద కనిపిస్తుంది. ఈ విషయమై పురపాలిక శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
చేతిలో కర్రలేనిదే కాలనీలోకి వెళ్లడం కష్టమవుతుంది. చిన్న పిల్లలు రోడ్డెక్కితే పందులు పిల్లల వెంట బడి కరుస్తూ దాడులకు తెగబడుతున్నాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో సైతం పందులు తిరుగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే పట్టణవాసులు కోతులు, కుక్కలతో ఇబ్బందులు పడుతుంటే మళ్లీ పందుల గోల ప్రజలను పట్టి పీడిస్తుంది.
పందులు గల్లీలోకి వచ్చి ఆదమరిస్తే ఇంట్లోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. పందుల బాధ నుండి తమకు విముక్తి కల్గించాలని పురపాలిక శాఖ అధికారులకు పట్టణ వాసులు వేడుకుంటున్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం