EX MLA Mahareddy Bhupal Reddy | పెద్దశంకరంపేట, ఏప్రిల్ 19 : వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దశంకరంపేట మండలం నుండి భారీగా తరలి రావాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దశంకరంపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివెళ్లి కేసీఆర్ సభను విజయవంతం చేయాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని.. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా కావాలని కోరుకుంటున్నారన్నారు.
రజతోత్సవ సభను విజయవంతం చేసెందుకు ప్రతీ కార్యకర్త తరలిరావాలన్నారు. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు సురేష్‌గౌడ్, దత్తు, రమేష్, వెంకట్‌రెడ్డి, లింగయ్య, ప్రకాశ్, జంగం రాఘవులు, నర్సింహులు, ప్రకాశ్ తదితరులున్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్