KCR | మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 12 : ఎల్కతుర్తిలో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జుగౌడ్ పిలుపునిచ్చారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రజతోత్సవ సభ ప్రజల సభ అన్నారు. రజతోత్సవ మహాసభ చారిత్రాత్మకమవుతుందన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని పోరాటం చేసి తెలంగాణ సాధించిన కారణజన్ముడు కేసీఆర్ అని కొనియాడారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యావత్తు దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిన పాలనాధక్షుడు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్ అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కేసీఆర్ పాలన చేశారన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం చెబుతారో అని తెలంగాణ ప్రజలు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. రజతోత్సవ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తు తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!