Property tax | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్ను వడ్డీపై వన్‌టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ 90 శాతం రాయితీ కల్పించిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు.
ఈ నెల 31లోపు ఆస్తి పన్ను, వడ్డీతో సహా ఓకేసారి చెల్లిస్తే వడ్డీలో 10 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఆస్తి పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని, గడువులోగా ఆస్తి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి పాటు పడాలని శ్రీనివాస్‌రెడ్డి కోరారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!