Pensioners | నర్సాపూర్, మార్చి 27 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయోనంటూ వృద్దులు, వికలాంగులు, వితంతువులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. తమకు పెన్షన్ డబ్బులు ఇప్పించండి మహా ప్రభో అంటూ పింఛన్‌దారులు నర్సాపూర్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు పోటెత్తారు. వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ మున్సిపాలిటీకి చెందిన వృద్దులు, వికలాంగులు, వితంతువులు తమకు నెల నుండి పింఛన్ రావడం లేదని.. పింఛన్ డబ్బులను తమకు ఇప్పించాలని ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు వచ్చారు.
ఈ సందర్బంగా పింఛన్‌దారులు మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని, తమకు రావాల్సిన ఫించన్ డబ్బులు ఇవ్వాలని కోరగా.. ఇంతలోపు మీకు రాదని, పండుగ తర్వాతనే పింఛన్ వస్తుందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్‌దారులు ఎవరిని అడగాలో తెలియక ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి అధికారులను అడుగగా.. పింఛన్‌తో మాకు సంబంధం లేదని మున్సిపల్ కార్యాలయంలో అడగాలని తెలిపారని అన్నారు.
చేసేలేం లేక మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అక్కడి అధికారులను అడగగా కమిషనర్ లేడని.. బయట కూర్చోండని పంపించారని తెలిపారు. దీంతో పింఛన్‌దారులు మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో కాసేపు కూర్చొని తిరిగి పోస్టాఫీస్‌కు వెళ్లారు. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, నెలనెలా సరిగ్గా పింఛన్ రావడం లేదని, మాకు పింఛన్ డబ్బులు అందించాలని వారు గోడు వెల్లబోసుకున్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!