Padmadevender Reddy| మెదక్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలని, లేదా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎం పద్మాదేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో జిల్లా రైతాంగం అయోమయంలో ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సింగూర్ నుండి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయిస్తారా..లేదా..? క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము.
సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే ఘనపూర్ ఆయకట్ట కింద పంటలు సాగుతాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ సింగూర్ నీళ్ల విషయంలో అధికారికంగా ప్రకటన చేయకపోవడం రైతులను అయోమయానికి గురి చేస్తుందని ఈ విషయంపై ప్రభుత్వం మొండి వైఖరి తగదని ఎద్దేవా చేశారు.
ప్రతీ పంటకు నీరందించిన ఘనత కేసీఆర్‌ది..
బీఆర్ఎస్ హయాంలో ప్రతీ పంటకు నీరందించిన ఘనత కేసీఆర్‌దని అన్నారు. సింగూర్ నుండి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లకుండా మెదక్ జిల్లాకు నీరును అంకితం చేసింది కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని మండిపడ్డారు. వానకాలం జరిగిన నష్టపరిహారం ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సింగూర్ నుండి నీటిని విడుదల చేస్తారా..? లేదా క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారా..? అనే విషయమై ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నామని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. లేని యెడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, మాజీ ఎంపీపీలు కొత్తపల్లి కిష్టయ్య,దుర్గయ్య,మాజీ కౌన్సిలర్లు విశ్వం, మాయ మల్లేశం చంద్రకళ,సోహెల్, పట్టణ పార్టీ కోకన్వీనర్లు కృష్ణ గౌడ్ లింగారెడ్డి, సర్పంచ్ లు సాంబశివరావు, మ్యాకల.సాయిలు,నాయకులు సోములు,మెడిశెట్టి. శంకర్, సాయిలు, రాజు,ఉదయ్, రామచంద్ర రెడ్డి మోహన్ నాయక్ రాజు, శ్రీనాథ్ రావు,సంగమేశ్వర్, బద్రి. మల్లేశం,మాజీ సర్పంచ్ లు, మెదక్ పట్టణం, మెదక్, హవెలిఘనపూర్, పాపన్నపేట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.