Padma Devender Reddy | మెదక్ రూరల్, నవంబర్ 26 : మెదక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్ సోదరుడు రాయన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధ గౌడ్ గుండె పోటుతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి రాయిన్ పల్లి గ్రామానికి చేరుకొని సిద్ధ గౌడ్ భార్య లక్ష్మిని, అన్న అంజాగౌడ్‌ను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు.
ఆకస్మికంగా కుటుంబ సభ్యుడిని కోల్పోవడం చాలా బాధాకరమని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్బంగా సిద్ధ గౌడ్ సర్పంచ్‌గా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. పద్మా దేవేందర్ రెడ్డి వెంట జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి, నాయకులు కొత్తపల్లి కిష్టయ్య, యాదగిరి, మైసా గౌడ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం