Sanitation | మెదక్ రూరల్, ఏప్రిల్ 16 : ప్రత్యేకాధికారుల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పారిశుధ్యంపై అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. కాగా మెదక్ మండలంలో ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారం పేరుకు పోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు నామ మాత్రంగా పని చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వీధిదీపాలు పనిచేయడం లేదు. ముఖ్యంగా ఎండాకాలం కావడంతో ఆయా గ్రామాల్లో మోటార్లు మరమ్మతులు చేయకపోవడం, మిషన్ భగీరథ రాకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామాల ప్రత్యేకాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించకపోవడంతో గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని, ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also :
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం