నల్లగొండ, ఫిబ్రవరి 19 : నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మానవత్వం చూపారు. కొండామల్లేపల్లి నుండి నల్లగొండ వచ్చే దారిలో ధర్వేశిపురం గుడి దగ్గరలో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ సమీపంలో అప్పుడే జరిగిన యాక్సిడెంట్‌ను చూసి మానవత్వం దృక్పథంతో చల్లించి వెహికల్ దిగి అంబులెన్స్ కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే వరకు దగ్గర ఉండి క్షతగాత్రుడిని ఆస్పత్రికి పంపించారు.
కనగల్ మండల కేంద్రానికి చెందిన ఏకెళ్లి పరమేశ్ బైక్‌పై నల్లగొండ నుండి కనగల్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో కనగల్ నుండి నల్లగొండ వైపు వెళ్తున్న కారు పరమేశ్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో పరమేశ్ రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న కలెక్టర్ రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించి బాధితుడిని చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలో పరిస్థితి విషమించడంతో పరమేశ్ మరణించినట్లు కనగల్ ఎస్ఐ రాజీవ్‌రెడ్డి తెలిపారు.

నల్లగొండ కలెక్టర్ మానవత్వం