ఆదిలాబాద్ : ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) ను మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) గురువారం పరామర్శించారు. గురువారం హైదరాబాద్ నుంచి నేరుగా ఆదిలాబాద్‌కు హరీష్‌రావు చేరుకున్నారు.
హరీష్‌రావుతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, భోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించారు.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోయినాగాని మున్సిపాలిటీని దక్కించుకోవాలనే దుర్బుద్దితో విధులకు ఆటంకం కల్పించారనే తప్పుడు ఫిర్యాదుతో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టు చేయించింది. అనంతరం సుమన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో సుమన్‌ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.