Devi Sri Prasad | టాలీవుడ్లో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌కు ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలన్ని మ్యూజికల్ బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి. దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఫిబ్రవరి 22న కొత్త సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు.
ఆఫ్ స్క్రీన్‌లో కంపోజర్‌గా ఎన్నో సంవత్సరాలు వర్క్ చేసిన డీఎస్పీ ఫైనల్‌గా ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బలగం డైరెక్టర్ వేణు యెల్దండి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా చాలా కాలం తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ యాక్టింగ్ డెబ్యూపై బీటౌన్ మీడియాతో చేసిన ఓ చిట్‌చాట్‌లో ఓపెన్ అయ్యాడు.
‘ఎల్లమ్మ సంగీత మూలాలతో ముడిపడి ఉంటుంది. ఈ విషయమే నన్ను సినిమాలో నటించేలా చేసింది. యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా ముందుగానే ప్లాన్ చేసుకున్నానన్నాడు డీఎస్పీ. కొన్నేళ్ల క్రితం పుష్ప డైరెక్టర్ సుకుమార్ తనను హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేశాడట. అయితే తన తండ్రి అకాల మరణంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చ లేదన్నాడు’ దేవీ శ్రీ ప్రసాద్ .
త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, నిర్మాత ఎస్ థాను, దిల్ రాజు యాక్టింగ్ చేయమని తరచూ తనను ప్రోత్సహించేవారని.. ఆ ప్రోత్సాహం ఇప్పుడు ఎల్లమ్మ రూపంలో మీ ముందుకు వస్తుందన్నాడు డీఎస్పీ. ఎల్లమ్మ కోసం నెలలో కేవలం 10 రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వాలని దిల్ రాజు తనను అడిగారని.. ఈ షూటింగ్ ద్వారా తన మ్యూజికల్ జర్నీపై ఎలాంటి ప్రభావం పడదన్నాడు డీఎస్పీ. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఎల్లమ్మ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Congress | కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నది : గండ్ర వెంకటరమణారెడ్డి
Afghanistan | ఎముకలు విరిగితేనే నేరమట.. గృహ హింసను చట్టబద్ధం చేసిన అఫ్గానిస్థాన్..!
‘మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం’