Harmanpreet Kaur : వన్డే వరల్డ్‌కప్ విజయంతో భారత మహిళా క్రికెట్ సుదీర్ఘ కలను సాకారం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కొత్త ఏడాదిలో చరిత్ర సృష్టించింది. టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా అప్పుడు రికార్డు నెలకొల్పిన తను.. ఈసారి దిగ్గజాలకు సాధ్యమవ్వని ఘనత సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా హర్మన్‌ప్రీత్ అవతరించింది. ఆస్ట్రేలియా గడ్డపై గురువారం రెండో టీ20లో ఆడడం ద్వారా హర్మన్‌ప్రీత్ ఈ ఫీట్ సాధించింది.
దూకుడైన ఆటతో భారత జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ తనపేరిట పలు రికార్డులు రాసుకుంటోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన హర్మన్‌ప్రీత్.. అత్యధిక మ్యాచ్‌లు ఆడేసింది. అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ సుజీ బేట్స్ రికార్డును బ్రేక్ చేస్తూ… 356వ మ్యాచ్‌లో ఆడింది భారత కెప్టెన్.
Smiles, applause and a special day 😊
Celebrating #TeamIndia captain Harmanpreet Kaur’s historic milestone 🙌#AUSvIND | @ImHarmanpreet pic.twitter.com/kEher5Z3JP
— BCCI Women (@BCCIWomen) February 19, 2026
The most capped woman in cricket – Harmanpreet Kaur ⭐ pic.twitter.com/rSzUAF1KeU
— ESPNcricinfo (@ESPNcricinfo) February 19, 2026
చిన్నప్పటి నుంచి క్రికెట్టే ధ్యాసగా పెరిగిన ఈ పంజాబీ కెరటం 2009లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే మూడు ఫార్మాట్లలోనూ పాతుకుపోయింది. ఇండియా తరఫున మిథాలీ రాజ్( Mithali Raj)ను ఎప్పుడో అధిగమించిన హర్మన్‌ప్రీత్.. ఆస్ట్రేలియా గడ్డపై బేట్స్‌ను వెనక్కి నెట్టేసింది. ఇప్పటివరకూ ఆరు టెస్టులు, 161 వన్డేలు, 189 టీ20లు ఆడింది. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఎలీసా పెర్రీ (ఆస్ట్రేలియా) 349, మిథాలీ రాజ్(భారత్) 333, చార్లొట్టే ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) 309, సోఫీ డెవినె(న్యూజిలాండ్) 305 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
పంజాబ్‌లోని మొగా గ్రామంలో1989 మార్చి 8న జన్మించింది. ఆమె తండ్రి హర్మీందర్ సింగ్ జిల్లా న్యాయస్థానంలో క్లర్క్. తల్లి సత్విందర్ కౌర్ గృహిణి. హర్మన్ వాళ్ల నాన్నకు క్రీడలంటే ఆసక్తి. ఆయన బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ ఆడడం చూసి క్రీడల మీద ఇష్టం పెంచుకుంది తను. దాంతో, అప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆమె క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలో చేరింది. క్రికెటర్‌గా రాణించేందుకు అన్ని నైపుణ్యాలున్న హర్మన్‌ను చూసిన కమల్దీష్ సింగ్ సోధీ .. తన ప్రైవేట్ అకాడమీలో చేర్చుకున్నాడు. అక్కడ అబ్బాయిలతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేసిన తను.. బలంగా షాట్లు కొట్టడంతో పట్టుసాధించింది.
3⃣5⃣6⃣* matches of utmost commitment and determination 🫡
Congratulations to #TeamIndia captain Harmanpreet Kaur on becoming the most-capped international player in women’s cricket 👏👏 #AUSvIND | @ImHarmanpreet pic.twitter.com/wMfgOE6AFU
— BCCI Women (@BCCIWomen) February 19, 2026
సోధీ తర్ఫీదులో రాటుదేలిన హర్మన్ జూనియర్ స్థాయిలో సత్తా చాటి.. 2009 మార్చిలో వన్డేల్లో అరంగేట్రం చేసింది. అదే ఏడాది జూన్‌లో టీ20ల్లోనూ ఎంట్రీ ఇచ్చిన తను నిలకడగా రాణిస్తూ కీలక ప్లేయర్‌గా ఎదిగింది. 2012లో తొలిసారి ఆసియా కప్‌లో సారథ్యం వహించిన హర్మన్ 2016లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమె నేతృత్వంలో.. భారత జట్టు 2020లో పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. అనంతరం మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు రెండు ట్రోఫీలు సాధించి పెట్టింది హర్మన్.