Haritha Haram | మెదక్ రూరల్, జూన్ 15 : ‘తెలంగాణ పచ్చ బడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే… పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలే..’ అనే సదుద్దేశంతో కేసీఆర్ సర్కారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నేటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
నాడు ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళ లాడిన హరితహారం మొక్కలు.. నేడు ఆ అధికారుల వైఫల్యంతో ఎండిపోయాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు కూడా ఎండిపోయి కళావిహీనంగా మారాయి. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు సైతం చాలా చోట్ల చనిపోయాయి. ఒకప్పుడు పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఫారెస్టు శాఖల అధికారులు పట్టించుకోవడంలేదు.
కొత్త మొక్కలు నాటక పోగా.. ఉన్నవాటిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. మెదక్ మండలంలోని కొంటూరు చెరువు వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోవడంతో అక్కడ పల్లె ప్రకృతి వనం బోర్డు మాత్రమే కనిపిస్తుంది. పిచ్చిమొక్కలు, ఎండిపోయిన మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లక్షలు ఖర్చుపెట్టిన పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం